![]() |
![]() |
.webp)
ఫన్ ప్యాక్డ్ ఫామిలీ ఎంటర్టైన్మెంట్ గా నెక్స్ట్ సండే "ది ఫామిలీ అసెంబ్లీ" పేరుతో ఒక షో జీ తెలుగులో రాబోతోంది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక హోస్ట్ గా సమీరా భరద్వాజ్ వచ్చింది. అలాగే రోజా, గగన్, భూమి, జెడి చక్రవర్తి, ఫారియా వంటి వాళ్లంతా కనిపించారు. "ఎం జరుగుతుందో అది చెప్పండి" అని రోజా అడిగింది. "రొమాన్స్ లేకుండా అన్ని జరుగుతున్నాయి " అన్నాడు గగన్. "రోజా గారికి పెళ్ళై 30 ఏళ్ళు అయ్యింది.
ఎప్పుడైనా ఇలా చేశారా అసలు " అని సమీర్ అడిగింది. "అసలు నా గురించి నీకెందుకు " అంది రోజా. ఇక తర్వాత జేడీ చక్రవర్తి వచ్చి "ఈ షోలో అందరినీ కలుపుతున్న రోజా " అని చెప్పాడు. "అధ్యక్షా దీన్ని నేను ఖండిస్తున్నాను " అంది రోజా. "యాంకర్ గా నేను ఈ షోని ఎలా నిలబెట్టాలా అని నేను ఆలోచిస్తుంటే " అని రోజా ఒక ఫోజ్ లో నిలబడితే పక్కనే ఉన్న సమీరా భరద్వాజ్ "నేను ఈ షో అంతా మీరు నిల్చుని ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నా " అని కౌంటర్ ఇచ్చింది. ఇక సమీరా ఈ షోకి వచ్చిన వాళ్ళతో కొన్ని టాస్కులు ఆడించింది. రొమాన్స్ - నవ్వు రోలర్ కోస్టర్ లా ఉండబోతోంది.
ఇక గగన్ - భూమి చేసిన రొమాన్స్ అందరికీ నవ్వు తెప్పించింది. మేఘసందేశం సీరియల్ ద్వారా గగన్ - భూమి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీళ్లకు చాలామంది ఫాన్స్ ఉన్నారు సోషల్ మీడియాలో...ఇక ఈ షోలో కూడా వీళ్ళ మధ్య రొమాన్స్ కూడా మంచి ఫన్ క్రియేట్ చేసింది.రోజా ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. ఇక సమీరా భరద్వాజ్ ఒక సింగర్. వీళ్ళ షో మరి ఎలా ఉండబోతోందో చూడాలి.
![]() |
![]() |